ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం

రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మృతిచెందాడు. మాడ్గుల మండలం కొల్కులపల్లిలో పడాల అక్రమ్‌(40) అనే వ్యవసాయ కూలీ పిడుగుపాటుతో మృతిచెందాడు. అతడు పొలం పనిచేస్తుండగా పిడుగుపడి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదే ఘటనలో అప్పారావు అనే వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు తెలిపారు. కడ్తాల్‌ మండలం పుల్లేరుబోడు తండాలో పిడుగుపాటుకు ఎద్దు మృతిచెందింది. అలాగే జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. చౌదరిగూడ, ఇంద్రనగర్‌, తూంపల్లి గ్రామాల్లో వర్షంతో ప్రయాణికుల రాకపోకలు గంటసేపు నిలిచాయి. యాచారం మండలంలో మధ్యాహ్నం నుంచి రెండున్నర గంటన్నరపాటు భారీ వర్షం కురిసింది. నందివనపర్తి చెరువు అలుగు దాటలేక రైతులు ఇబ్బంది పడ్డారు. వరి, పత్తిపంటలు నీట మునిగాయి. రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడెం మండలం కాసులబాద్‌లో అత్యధికంగా 75.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Leave a Reply

Your email address will not be published.