పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్: జనసేన ఆఫీస్ లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేసారు. దసరా నవరాత్రుల సందర్భంగా పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. ​అమ్మవారిని అర్చించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సకల శుభాలు కలుగచేయాలని ప్రార్థించారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై అక్టోబర్ నెలలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. త్వరలోనే జిల్లాలవారీగా సమీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.