గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్టు

గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్టు

ఘట్‌కేసర్‌: గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మేడిపల్లి గణేష్‌ నగర్‌కు చెందిన ఉప్పల విజయ్‌కుమార్‌(21) గురువారం గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న జిల్లా ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం, ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ పోలీసులు చెంగిచెర్ల పెట్రోల్‌ పంపు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయ్‌కుమార్‌ బ్యాగును తనిఖీ చేయగా.. కిలో 170గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. కాగా, నిందితుడు గంజాయిని ఏపీలోని అరకు నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చి ఈప్రాంతంలో ఎక్కవ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.