ఆపిల్‌లో ఉంటే షోషకాల గురించి మీకు తెలుసా.. ఆపిల్‌ ఏ రోగాన్ని మటు మాయం చేస్తుందో తెలుసా..?

మనం తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారమే మనకు రక్ష. మనం తీసుకునే ఆహారంతో జాగ్రత్తలు పాటించకుంటే అనారోగ్యానికి గురయే ప్రమాదం ఉంది. మారుతున ఆహార అలవాట్ల వల్ల చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు లాంటి దీర్ఘకాల రోగాలు బాధపడుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పంఢ్లది కీలక పాత్ర. పండ్లు మనకు ఎన్నో రకాల విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ అందిస్తాయి. వీటిల్లో ఆపిల్ ప్రధానమైనది. ఆపిల్‌‌లో ఉండే పోషకాలు ఎన్నో రకాలుగా మన శరీరానికి దోహదం చేస్తాయి. ఆపిల్‌ను తరచూ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆపిల్‌లో పాలీపెనాల్స్, పెక్టివ్ అధికంగా ఉంటాయి. గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తాయి. ప్రతి రోజు ఒక ఆపిల్ తినడం వల్ల గుండె జబ్బుల నుంచి బయటపడొచ్చు. కణాల్లో లిపిడ్, ఆక్సీకరణను నివారించడానికి సాయపడతాయి రక్తపోటును తగ్గిస్తాయి.

బరువు తగ్గేందుకు కూడా ఆపిల్ దోహద పడతుంది. దీన్ని తరచుగా తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆపిల్‌లో ఉండే ఫైబర్ వల్ల పేగుల నుంచి నీటిని గ్రహిస్తుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా మలవిసర్జన సుఖంగా జరుగుతుంది. మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్‌ను అదుపులో ఉంటాయి. రక్త ప్రవాహంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆపిల్ తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అందువల్ల రోజువారీ తీసుకునే ఆహారంలో ఆపిల్‌ను తప్పకుండా తీసుకోవడం ఉత్తమం.

Leave a Reply

Your email address will not be published.