ధనియాలే కదా అని తీసి పారేయకండి.. వీటి వల్ల ఎన్ని లాభాలో..

మన వంటిళ్లు ఆరోగ్య నిలయం. వంటింట్లోనే ఉండే దినుసులతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా మనం వాటిని వాడుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాం. ఈ నిర్లక్ష్యంతోనే మన అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఏ వంట చేసినా అందులో ధనియాలది ప్రముఖ పాత్ర. అంతే దనియాల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. శరీరంలో ఉన్న అధిక కొవ్వును ఇవి కరిగిస్తాయి. ధనియాలను ఏ రూపంలో తీసుకున్న షుగర్‌ను నియంత్రిస్తుంది. చర్మం, జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే దనియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి, ఆందోళన, అలసట దూరం చేస్తాయి. ఇందులో ధనియాలు ప్రతి రోజు తీసుకుంటే ఎంతో మంచిది. కొత్తిమీరలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. కొత్తిమీర విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీని వల్ల కంటి సమస్యల నుంచి బయటపడోచ్చు.

అలాగే గుండె జబ్బుల రాకుండా చేస్తుంది. శరీరం వేడిగా ఉంటే రాత్రిళ్లు నిద్ర పట్టదు. ధనియాలు వాడడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి బయటపడొచ్చు. కండరాలకు రిలాక్స్ కలిగేలా చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్, శ్వాస సమస్యలు దూరం చేస్తాయి. ధనియాల నీరు తాగడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తాయి. ధనియాల నీరు వల్ల గ్యాస్ సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అందువల్ల ప్రతి రోజు ధనియాలను ఆహారంలో ఒక భాగంగా తీసుకోవడం మంచింది. ధనియాలను నూనెతో కలిపి తీసుకుంటే జుట్టు రాలే సమస్య కూడా ఉండదు. ధనియాల్లో ఉండే ఐరన్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. చికాకును తగ్గిస్తాయి.

Leave a Reply

Your email address will not be published.