‘మునుగోడు’ ఫలితాలపై ఆ ఒక్క ప్రాంతంలోనే ఇన్ని కోట్ల పందేలా..

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు అనే దాని కోట్లల్లో బెట్టింగ్‌లు పెట్టారు. గెలిచేదెవరు? రెండో స్థానం ఎవరిది? మెజార్టీ ఎంత? ఇలా బెట్టింగ్ పెట్టారు. అయితే ఉప ఎన్నిక తెలంగాణలో జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఏపీలోనే ఎక్కువగా బెట్టింగ్‌లు పెట్టారు కాబట్టి. ఈ బెట్టింగ్‌లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో క్రికెట్‌ బుకీలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు కీలక భూమిక పోషించారని చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు పక్కనే ఉన్న విశాఖ నగరంలోనే రూ.100కోట్ల వరకు బెట్టింగ్‌లు జరగగా విజయవాడ, భీమవరం భారీగా బెట్టింగ్‌ పెట్టారు. ఈ బెట్టింగ్ రాయుళ్లు ముందే మునుగోడు సర్వేలో పాల్గొన్న వారికి లక్షల్లో చెల్లించి సమాచారాన్ని తెప్పించుకున్నారు. గెలుపు ఓటములు ముందే పనిగట్టి పందేలు కాశారు.

అలాగే హైదరాబాద్‌ కేంద్రంగా పందాలు కాశారు. రియల్టర్లు, టీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన కీలక నేతలు హైదరాబాద్‌లో పందేలకు దిగారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు వరంగల్‌, ఏపీలోని కర్నూల్‌, తిరుపతి, కడప, విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు చెందిన వారు మునుగోడు ఉప ఎన్నికపై పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.1,600 కోట్ల బెట్టింగ్‌లు పెట్టినట్లు సమాచారం. ఈ బెట్టింగ్‌ రూపాయికి ఐదు రూపాయిల వరకు చేరుకున్నట్లు సమాచారం. బెట్టింగ్‌ల కోసం ఇతర జిల్లాల నుంచి వచ్చి మునుగోడు పరిస్థితులను తెలుసుకుని గెలుపు గుర్రాలపై పందెం కాసినట్లు తెలుస్తోంది. అయితే అత్యధికంగా రాజగోపాల్‌రెడ్డిపై పందెం పట్టారు. కానీ.. ఎగ్జిల్ ఫలితాలు మాత్రం రాజగోపాల్‌రెడ్డికి భిన్నంగా వచ్చాయి. దీంతో రాజగోపాల్‌రెడ్డిపై బెట్టింగ్ పెట్టిన వాళ్లు ఆందోళనలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.