కరీనా కపూర్ ను షూటింగ్ స్పాట్లో చూసి షాక్ అయినా అభిమానులు..
బాలీవుడ్ అగ్ర తారల్లో ఒక్కరైనా కరీనా కపూర్ ఇటీవలే ఒక్క మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబు పుట్టి కనీసం ఒక నెల కూడా అవ్వకముందే కరీనా కపూర్ ముంబైలోని బాంద్రాలో ఓ సినిమా షూటింగ్కు హాజరైంది. తన టీంతో కలిసి షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన కరీనా కపూర్ కారులో నుండి దిగి వస్తున్న ఆమె ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో తెగ చెక్కర్లు కొట్టేస్తున్నాయి. అభిమానులను పలకరించిన కరీనా కపూర్ రోజు రోజుకి పెరుగుతున్న కరోనా వ్యాప్తి పట్ల చాల జాగ్రత్తగా ఉండాలని మాస్క్లు ,శానిటైజర్లు ఉపయోగించుకోవాలి అవసరం ఉంటె తప్ప బయటికి వెళ్లవద్దని భౌతిక దూరం పాటించాలని ఆమె అభిమానులను కోరింది.