దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు కీలక పదవి..

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు కీలక పదవి..

హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలంగాణ రాష్ట్ర జిమ్మాస్టిక్స్‌ సంఘం నూతన అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఫతేమైదాన్‌ క్లబ్‌లో ముందుగా జిమ్నాస్టిక్స్‌ సంఘం వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన తర్వాత కొత్త కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ప్రధాన కార్యదర్శిగా సోమేశ్వర్‌ సహా నూతన కార్యవర్గం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని  వ్యాఖ్యానించారు. గెలిచిన వాళ్లకు డబ్బులు ఇస్తున్నారు తప్ప క్రీడాకారుల శిక్షణకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని అయన అన్నారు . అసెంబ్లీ సమావేశాల్లో క్రీడలకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు రఘునందన్ రావు. తెలంగాణ రాష్ట్రంలో జిమ్నాస్టిక్‌కు ప్రాధాన్యత తీసుకొచ్చేలా పనిచేస్తాన్నారు దుబ్బాక ఎమ్మెల్సే రఘునందన్‌రావు.

Leave a Reply

Your email address will not be published.