హీరో కృష్ణుడుని అర్థరాత్రి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..

హీరో కృష్ణుడుని అర్థరాత్రి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టాలీవుడ్ హీరో కృష్ణుడుని నిన్న (శుక్రవారం) అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చెశారు. వివరాల్లోకి వెళితే టాలీవుడ్ నటుడు కృష్ణుడు నిన్న అర్థరాత్రి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విల్లాలో పేకాడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చెశారు. శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడుని ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హీరో కృష్ణుడితో పాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీసులు వారందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కృష్ణుడు అరెస్ట్ ను గోప్యంగా ఉంచిన మియాపూర్ పోలీసులు. హీరో కృష్ణుడు వినాయకుడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు ఆ తర్వాత పలు సినిమాలో అయన నటించారు.

Leave a Reply

Your email address will not be published.