bandi sanjay family,school,political: బండి సంజయ్ కుటుంబ నేపథ్యం,బాల్యం, రాజకీయ విశేషాలు..

bandi sanjay kumar biodata

బండి సంజయ్ కుటుంబ నేపథ్యం,బాల్యం, రాజకీయ విశేషాలు..

ఆర్.బి.ఎం డెస్క్:  తెలంగాణ ప్రజలకు పరిచయం అవసరంలేని నాయకుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర బీజేపీ రథ సారధి బండి సంజయ్ అయన కుటుంబ నేపథ్యం, బాల్యం, రాజకీయ విశేషాలు మీకోసం ..

బండి సంజయ్ బాల్యం..

బండి సంజయ్ శకుంతల,నర్సయ్య దంపతులకు జన్మించాడు. బండి సంజయ్ తండి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. బండి సంజయ్ ను వాళ్ల నాన్న సరస్వతి శిశుమందిర్‌ లో ఒకటో తరగతిలో చేర్పించారు. బండి సంజయ్ సరస్వతి శిశుమందిర్‌ లో చిన్నప్పటి నుండే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఘటన్‌ నాయక్‌గా,ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక స్థాయిలోనే బండి సంజయ్ ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేశారు.

బండి సంజయ్ రాజకీయ విశేషాలు..

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ లో కరీంనగర్ పట్టణ కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా,పట్టణ ఉపాధ్యక్షునిగా బండి సంజయ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో బండి సంజయ్ 1994-2003 మధ్యకాలంలో రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా పని చేశారు. బండి సంజయ్ భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా,పట్టణ అధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా,జాతీయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో అయన పని చేశారు. తమిళనాడు,కేరళ భారతీయ జనతా పార్టీ ఇంచార్జి‌గా కూడా బండి సంజయ్ బాధ్యతలు నిర్వర్తించాడు.

కరీంనగర్లో 2005 లో ఏర్పడిన నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో బండి సంజయ్ 48 వ డివిజన్ నుండి భాజపా కార్పొరేటర్ గా మూడుసార్లు ఎన్నికయ్యారు. కరీంనగర్ బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ రెండు పర్యాయాలు పని చేశారు. కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి బండి సంజయ్ ఓటమి పాలైయ్యారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ స్థానం నుండి బీజేపీ పార్టీ తరుపున బరిలోకి దిగి తెరాస పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ పై 14,000 పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ లోక్ సభ స్థానం నుండి బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసి తెరాస అభ్యర్థి బి.వినోద్ కుమార్ పై 89508 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ హై కమాండ్ బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా 11 మార్చ్ 2020 న నియమించింది.

బండి సంజయ్ కుమార్ బయోగ్రఫీ..
పేరు బండి సంజయ్ కుమార్
జననం జూలై 11, 1971
తల్లిదండ్రులు నర్సయ్య, శకుంతల
జీవిత భాగస్వామి అపర్ణ
పిల్లలు సుముఖ్‌,భగీరథ్
జాతీయత భారతీయుడు
వృత్తి పార్లమెంట్ సభ్యుడు, కరీంనగర్‌
మాతృ బాష తెలుగు
స్కూల్ సరస్వతి శిశుమందిర్‌
కాలేజీ, యూనివర్సిటీ కామరాజ్ యూనివర్సిటీ తమిళ్ నాడు
విద్య అర్హహత పోస్ట్ గ్రాడ్యుయేట్
ఇంటి చిరునామా H No 2-10-1525(NEW) 2-10-1145(OLD) జ్యోతినగర్,కరీంగర్
కులము
ఇష్టమైన కారు ఇన్నోవా కారు
ఇష్టమైన ద్విచక్ర వాహనం హీరో హోండా స్ప్లీన్డెర్ , యాక్టీవ్
ఆహార అలవాటు శాఖాహారం
అభిరుచులు ఆర్టికల్ రైటింగ్, యోగ, టీవీ న్యూస్
తెలిసిన భాషలు తెలుగు,ఇంగ్లీష్, హిందీ,మరాఠీ

 

బండి సంజయ్ కుమార్ కు ఇష్టమైనవి..
ఇష్టమైన రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ (బీజేపీ)
ఇష్టమైన నటుడు ఎన్.టి. రామారావు
ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి, సావిత్రి
ఇష్టమైన క్రీడా కబడ్డీ
ఇష్టమైన ప్రదేశం  నాసిక్,కాసి, ఆగ్ర
ఇష్టమైన రంగు కాషాయం
బండి సంజయ్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్లు
ఇమెయిల్ bandisanjayindian@gmail.com
ట్విట్టర్ https://www.facebook.com/bandisanjaykumar/
పేస్ బుక్ https://twitter.com/bandisanjay_bjp?lang=en

Leave a Reply

Your email address will not be published.