స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ను మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ బాక్సింగ్ ప్రెసిడెంట్ బి.డి.మోహన్, జనరల్ సెక్రెటరీ పి.రవీందర్..

స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ను మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ బాక్సింగ్ ప్రెసిడెంట్ బి.డి.మోహన్, జనరల్ సెక్రెటరీ పి.రవీందర్..

ఆర్.బి.ఎం హైదరాబాద్: బాక్సింగ్ క్రీడను రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలిసి చర్చించిన తెలంగాణ బాక్సింగ్ ప్రెసిడెంట్ బి.డి.మోహన్, జనరల్ సెక్రెటరీ పి.రవీందర్ మరియు ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్, తండ్రి జమీల్.

ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ప్రదేశ్ లో హైదరాబాద్ సిటీ నుండి ఎంతో మంది ప్రముఖ క్రీడా బాక్సర్ లు దేశానికి ప్రాతినిధ్యం వహించారు. అందులో ఒకరు ప్రస్తుత తెలంగాణ బాక్సింగ్ ప్రెసిడెంట్ బి.డి.మోహన్, పోలీస్ ఉద్యోగంలో బాక్సింగ్ క్రీడాకారుడిగా చేరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా రిటైర్ అయ్యారు. బీ.డీ.మోహన్ మాజీ అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అంతటి ప్రముఖులైన వ్యక్తి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండడం గర్వ కారణం అని అయన అన్నారు.

త్వరలో ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ కు ఇటీవల, హర్యానా రాష్ట్రంలో హిస్సార్ లో జరిగిన నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో 52 కిలోల విభాగంలో ఛాంపియన్ గా నిలిచిన నిఖత్ జరీన్ ను రాష్ట్ర క్రీడా మండలి నుండి ఘనంగా సన్మానిస్తామని, నిఖత్ జరీన్ తో పాటు, నిహారిక ను కూడా సన్మానిస్తామని తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ అధికారులకు ఛైర్మన్కు తెలియజేశారు.

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ ను నిర్వహించాలని అందుకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుమతులు పొందాలని ఈ బాక్సింగ్ నేషనల్స్ ను హైదరాబాద్ లో నిర్వహించడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా ఛైర్మన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.