“ఆరోగ్యమిత్ర” పేరిట టెలీమెడిసిన్ సేవలను ప్రారంభించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి జనార్దన్ రెడ్డి..

“ఆరోగ్యమిత్ర” పేరిట టెలీమెడిసిన్ సేవలను ప్రారంభించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి జనార్దన్ రెడ్డి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: జీవకోటి మనుగడకు ఆరోగ్యమే ప్రధానం అందుకే మన భారతీయుల జీవితం యుగయుగాలుగా ఆరోగ్యానికి మూలమైన ప్రకృతితో మమేకమవుతూ వచ్చింది. అయితే, నేడు మారిన జీవనసరళితో ఆరోగ్య ప్రమాణాలు కూడా మారుతూ అనారోగ్య పరిస్థితులు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో మన భారత ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛభారత్ లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. ఈ స్ఫూర్తితో నేడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని హొటల్ రాడిసన్ వేదికగా గజ్జల యోగానంద్ గారి GY ఫౌండేషన్ ద్వారా “ఆరోగ్యమిత్ర” పేరిట టెలీమెడిసిన్ సేవలు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయగారి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా దత్తాత్రేయగారు మాట్లాడుతూ నేటి కరోనా పీడిత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతను వివరించారు. “ఆరోగ్యమిత్ర” టెలీమెడిసిన్ సేవలకు శ్రీకారం చుట్టిన GY ఫౌండేషన్ కార్యకలాపాలను, యోగానంద్ గారి సేవాతత్పరతను ప్రశంసించారు.

యోగానంద్ మాట్లాడుతూ మన భారతీయులది మొదటి నుంచీ ఆరోగ్యమిత్ర సంస్కృతి అని పేర్కొన్నారు. మారుతున్న కాలంలో ఆరోగ్యప్రమాణాలు పతనం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, ఒక బాధ్యతగల పౌరునిగా తమ GY ఫౌండేషన్ ద్వారా “ఆరోగ్యమిత్ర” పేరిట టెలీమెడిసిన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ “ఆరోగ్యమిత్ర” టెలీమెడిసిన్ సేవల కోసం నమోదు చేసుకున్నవారు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సేవలు పొందవచ్చని, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి గాను నిపుణులైన వైద్యుల సలహాలు పొందవచ్చని తెలిపారు.

ఈ సందర్బంగా చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ GY ఫౌండేషన్ సంస్థ అనేది విద్య, వైద్య సహాయం, రక్తదాన శిబిరాలు, ప్రజా సమస్యలు, సామజిక భద్రత వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి సమాజానికి స్ఫూర్తిగా నిలిచిందని జనార్దన్ రెడ్డి అన్నారు. కరోనా విపత్కర సమయంలో GY ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సహాయక కార్యక్రమాలు ప్రజల కోసం చేశారని జనార్దన్ రెడ్డి తెలిపారు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించగా ఆర్థికంగా, ఆరోగ్యాంగా ఇబ్బందులు ఎదుర్కున్న వేలాది మందికి GY ఫౌండేషన్ చేయూతనిచ్చిందని ఈ సందర్బంగా చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక్ కిషన్ పంపాటి, MD, VINN హాస్పిటల్, సామ రంగారెడ్డి, BJP ప్రెసిడెంట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ (అర్బన్), తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/T38aDYeMIOc

Leave a Reply

Your email address will not be published.