కెసిఆర్ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోవడానికి సిద్ధంగా లేరు: బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి 

కెసిఆర్ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోవడానికి సిద్ధంగా లేరు: బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెరాస ప్రభుత్వం దళిత బంధు పథకం నిజాయితీతో ప్రకటించినట్లయితే ఎంతైనా అభినందనీయం అని బి.జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో కెసిఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారని జనార్దన్ రెడ్డి అన్నారు. నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేస్తామని అబద్దాలు పలికారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం కేవలం కెసిఆర్ కె సాధ్యమని జనార్దన్ రెడ్డి అన్నారు. దళిత ఉపముఖ్యమంత్రులను అవమానకరంగా ఊడపీకడం లాంటి దళిత వ్యతిరేక చర్యల దృష్ట్యా కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితులు ఇప్పుడు లేరు అని అయన అన్నారు . ఎన్నికల నేపథ్యంలో నూతనంగా రూపొందించిన దళిత బంధు పథకానికి కేవలం రూ.1200 కోట్లు కేటాయించారు. అది ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పకుండా కెసిఆర్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు అని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ళ 5 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పలేదని తప్పించుకున్న ఘనత కూడా కెసిఆర్ దక్కుతుందని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇళ్ళు మొత్తం డిమాండ్‌కు చాలినన్ని కట్టలేని ఈ ప్రభుత్వం వెళుతున్న వేగానికి మరో 60 ఏళ్ళు పట్టేటటుందని జనార్దన్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి కూడా వీరి కేటాయింపులను బట్టి చూస్తే 160 సంవత్సరాలు పట్టిన వింతలేదని అయన అన్నారు.దళిత బంధు పథకం కేవలం హుగురాబాద్ లోనే అమలు అవుతుందా లేక రాష్ట్రమంతా అమలవుతుందా అని కెసిఆర్ ను జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. హుజురాబాద్ లో కేవలం దళిత కులాలకు ప్రాధాన్యం ఇచ్చి మిగితా కులాలను పట్టించుకోకపోవడం దిక్కుమాలిన చర్య అని అయన అన్నారు. ఇతర కులాల ఓట్లు తెరాస ప్రభుత్వంకు అవసరం లేదా అని అయన అన్నారు. దళితులకు ఉపయోగపడే ఈ దళిత బంధు పథకాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఆగస్టు 9 వ తేదీన పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారని జనార్దన్ రెడ్డి తెలిపారు. నగరంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి పాదయాత్ర మొదలౌతుందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.