రాష్ట్రంలో పెరుగుతున్న ‘చలి’

హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అత్యల్పంగా నమోదు కావడంతో చలితీవ్రత పెరిగింది. ఈశాన్య దిశగా అతి తక్కువ ఎత్తులో వీస్తున్న ఈదురు గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు, మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కొమురంభీమ్‌ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పంగా 7.3 ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం సత్వార్‌లో 7.5, కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణ్‌పల్లిలో 7.6 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 50 ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. చలి తీవ్రత తట్టుకోలేక రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో ప్రజలు చలి మంటలు వేసుకున్నారు. చలికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.