ఉచిత వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

ఉచిత వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ మెతుకు ఆనంద్

ఆర్.బి.ఎమ్:  ధారూర్ మండల పరిధిలోని మోమిన్ కలాన్ గ్రామంలో ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి,   వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ… ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మొదటగా వికారాబాద్ నియోజకవర్గంలో నిర్వహించి సేవలందించడం చాలా సంతోషకరం అన్నారు.  ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు ఉంటూ ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్ ఆర్ ఫౌండేషన్ ద్వారా సేవలను అందిస్తున్న చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి  ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.