యువతరానికి స్ఫూర్తి ప్రదాత నేతాజీ: బి.జనార్దన్ రెడ్డి, చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి
ఆర్.బి.ఎం: యువతకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్ఫూర్తి ప్రదాత అని చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం సుభాష్ చంద్ర బోస్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని తన నివాసంలో నేతాజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళలు అర్పించారు.ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సాయుధ పోరాటమే స్వతంత్ర సాధనకు ఏకైక మార్గమని నమ్మిన పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అని ఆయన అన్నారు.దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తిచేసేందుకు జై హింద్ నినాదంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి దేశానికి ఒక బలమైన సైన్యాన్ని రూపకప్పన చేసిన స్వరాజ్య సంగ్రామ యోధుడన్నారు.నేతాజీ ఆశయాలకు అనుగుణంగా వారి బాటలో యువత నడవాలని జనార్దన్ రెడ్డి కోరారు.