ప్రభుత్వ భూముల్లో దర్జాగా మట్టి తవ్వకాలు: ఎం.వెంకటయ్య, నవాబుపేట్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్

ప్రభుత్వ భూముల్లో దర్జాగా మట్టి తవ్వకాలు: ఎం.వెంకటయ్య, నవాబుపేట్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్

ఆర్.బి.ఎం నవాబుపేట్, చిట్టిగిద్ద: నవాబుపేట్ మండల్ పరిధిలోని చిట్టిగిద్ద గ్రామం, కేశపల్లి చెరువు సమీపంలో అక్రమంగా ప్రభుత్వ భూముల్లో ఎర్ర మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని నవాబుపేట్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేడిపల్లి వెంకటయ్య అన్నారు.

ఈ సందర్భంగా మేడిపల్లి వెంకటయ్య ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్ర మట్టిని దళారులు తవ్వుకొని విక్రయాలకు పాల్పడుతుంటే అధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని వెంకటయ్య మండిపడ్డారు.

అధికారుల కనుసన్నల్లోనే ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని గతంలో ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని తహసీల్దార్ బుచ్చయ్యకు పిర్యాదు చేశామని ఆయన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరించారని వెంకటయ్య ఆరోపించారు. ఇకనైనా పైఅధికారులు ఈ అక్రమ తవ్వకాలను ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని నవాబుపేట్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేడిపల్లి వెంకటయ్య పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.