కందిలో గుంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్..

కందిలో గుంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్..

ఆర్.బి.ఎం కంది,చేర్యాల: కంది మండల పరిధిలోని చేర్యాలలో అక్రమంగా గుంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనిల్ నాయక్ అనే వ్యక్తి కంది మండల పరిధిలోని చేర్యాలలో కొంతమంది వ్యక్తులకు గుంజాయి సరఫరా చేయడానికి వెళుతున్న క్రమంలో అదే ప్రాంతంలో తనికీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అనిల్ నాయక్ ను వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు అనిల్ వద్ద నుండి గుంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాట్లాడుతూ గుంజాయి సరఫరా చేసిన గుంజాయిని సాగు చేసే ప్రయత్నం చేసిన చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొని పీడీ యాక్టులు పెడతామని పోలీసులు తెలిపారు.గుంజాయి సరఫరా చేసే వ్యక్తుల గురుంచి గుంజాయి సాగు చేసే వారి సమాచారం తెలిపిన వ్యక్తుల వివరాలు గోప్యాంగ ఉంచుతామని అలంటి వ్యక్తుల సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.