మంత్రి మల్లారెడ్డి ఒక పిచ్చి కుక్క: అద్దంకి దయాకర్

మంత్రి మల్లారెడ్డి ఒక పిచ్చి కుక్క: అద్దంకి దయాకర్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసెడెంట్ రేవంత్ రెడ్డిపై తెరాస మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడడం మంచిదికాదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మీడియా సమావేశంలో అన్నారు.రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ప్రగతి భవన్ కేద్రంగా నిన్న రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను అద్దంకి దయాకర్ ఖండించారు.తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ పెరుగుతుంటే తెరాస పార్టీ నాయకులకు కళ్ళుమండుతున్నాయని దయాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పైకి కాటికి కాలు చాపిన మూసల్లోడితో విమర్శలు చేయిస్తే ఎలాంటి లాభం లేదని అద్దంకి దయాకర్ అన్నారు.

గజ్వేలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అక్కడ రేవంత్ రెడ్డి నిలబడి భారీ మెజారిటీ తో గెలుస్తాడు ఈ సవాల్ ను కెసిఆర్ స్వీకరిస్తారో లేదా మంత్రి మల్లారెడ్డి స్వీకరిస్తారో మీ ఇష్టం అని అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వేలో ప్రజలు కెసిఆర్ ను 84 శాతం తిరస్కరించారని దయాకర్ అన్నారు. మూడు చింతలపల్లిలో దళితులు గిరిజనులు కెసిఆర్ మాడ పగగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని దయాకర్ అన్నారు. తెలంగాణాలో ఉన్న అన్ని సమస్యలపై రేవంత్ రెడీ నాయకత్వంలో పోరాటాలు చేస్తామని  దయాకర్ పేర్కొన్నారు.

కనీసం సంతకం పెట్టడానికి రాని దద్దమ్మలు తెరాస పార్టీలో మంత్రులు అని అద్దంకి దయాకర్ అన్నారు. మంత్రి మల్లారెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే మల్లారెడ్డి పై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తని పెట్టి గెలిపిస్తాడని రేవంత్ రెడ్డి స్థాయి మల్లారెడ్డి ది కాదని అద్దంకి  దయాకర్ అన్నారు. కెసిఆర్ రాజీనామా చేసి వస్తే ప్రజలు కెసిఆర్ ను పెద్దకొడుకుగా చూస్తున్నారో లేదా రేవంత్ రెడ్డి పెద్ద కొడుకులాగా చూస్తున్నారో తేలిపోతుందని అద్దంకి దయాకర్ మీడియా సమావేశంలో అన్నారు.

Leave a Reply

Your email address will not be published.