ఓ వివాహా వేడుకలో ఎంపీ కవిత బుల్లెట్ బండి పాటపై డాన్స్ వీడియో వైరల్..

ఓ వివాహా వేడుకలో ఎంపీ కవిత బుల్లెట్ బండి పాటపై డాన్స్ వీడియో వైరల్..

ఆర్.బి.ఎం డెస్క్: తాజాగా ఒక వివాహా భారత్ లో బుల్లెట్ బండి పాటపై వధూవరులు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. దాంతో ఆ వధూవరులు రాత్రికిరాత్రే సెలబ్రిటీలుగా మారిపోయారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో బుల్లెట్ బండి పాట ట్రెండింగ్లో ఉంది.ప్రస్తుతం ప్రతి చిన్న పెద్ద వేడుకల్లో ఈ బుల్లెట్ బండి పాట మార్మోగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పాటకి స్టెప్పులు వేయాల్సిందే.ఇప్పుడు ఈ బుల్లెట్ బండి పాటకి విద్యార్థులే కాకుండా రాజకీయ నాయకులు సైతం స్టెప్పులు వేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ లీడర్ వెంకన్న గౌడ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత. ఆ వివాహానికి ముఖ్య అతిథిగా హాజరైన మాలోతు కవిత టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కటికనేని హరితో కలిసి బుల్లెట్ బండిపాటపై స్టెప్పులు వేశారు. ఎంపీ కవిత డాన్స్ చేయడంతో ఫంక్షన్ హాల్ లో సందడి వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published.