రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ బుద్ది మారలేదు: మంత్రి మల్లారెడ్డి
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎంపీ అయిన తర్వాత కూడా ఇంకా బ్లాక్ మెయిల్ బుద్ది మారలేదు అని మంత్రి మల్లారెడ్డి శనివారం మీడియా సమావేశంలో అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన సవాల్ ను ఇంకా స్వీకరించలేదు అని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తన సవాల్ ను స్వీకరించలేని రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లకూడదని మల్లారెడ్డి సూచించారు. తనపై భూకబ్జా ఆరోపణలు చేస్తూ ఏవో పిచ్చి జిరాక్స్ పేపర్లు మీడియా ముందుకు తీసుకొచ్చి చూపిస్తే సరిపోతుందా అంటూ మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి జిరాక్స్ పేపర్లు చూపించి బ్లక్ మెయిల్ చేస్తున్నాడు అని మల్లారెడ్డి తెలిపారు. హెచ్‌ఆర్డీ మినిస్టర్ రాత పూర్వకంగా మల్లారెడ్డి కాలేజీలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారని మల్లారెడ్డి గుర్తుచేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన హోదాకు తగ్గట్టు నడుచుకోవాలని మీడియా సమావేశంలో మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు.