టార్చర్ భరించలేక పోతున్న మల్లారెడ్డి..

mallareddy

మల్లారెడ్డి ఫోన్ ఎత్తడానికి జంకుతున్నారంట?.. టార్చర్ భరించలేక పోతున్న మల్లారెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హైదరాబాద్: రాష్ట్ర మంత్రిగా కాలేజీల అధిపతిగా మాల్లారెడ్డి సుపరితమే. ఆయన విభిన్నమైన వ్యక్తి. వేదిక ఏదైనా ఆయన తనకు అనుకూలంగా మార్చుకునే ఘనాపాటి. అసెంబ్లీ, కాలేజీ ఫంక్షన్, మీడియా సమావేశం ఇలా ఏదైనా చలోక్తులు విసరడం ఆయనకు సాటి ఏపార్టీలో ఉన్న ఆ పార్టీ అధినేతలను ఆకాశానికి ఎత్తడంతో ఆయన తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. అప్పటివరకు సరదాగా విమర్శలు సంధించే మల్లారెడ్డి ఒక్కసారిగా బూతుపురాణం అందుకున్నారు. దానికి ఓ కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడుచింతలపల్లిలో దళిత, గిరి జన ఆత్మగౌరవ దీక్ష చేశా రు. కేసీఆర్ దత్తత గ్రామాని కి ఏమిచేయలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్ శ్రేణులు రేవంత్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఇక మూడుచింతలపల్లిలో టిఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనుల పేరుతో కాంగ్రెస్ కు పోటీగా దీక్షకు వెళ్లే దారిపొడవునా మంత్రి పేరుతో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సి లు ఏర్పాటు చేశారు. దాంతో రెచ్చిపోయిన రేవంత్, మల్లారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇక దానికి కౌంటర్‌గా మల్లారెడ్డి కూడా రెచ్చి పోయారు. రేవంత్ కు తొడ కొట్టి సవాల్ చేసిన ఆయన అసభ్యపదజాలంతో అంతెత్తున లేచారు. దాంతో ఒక్క సారిగా చర్చమొత్తం మల్లా రెడ్డి బాషమీదకు మళ్లింది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా అదే రేంజ్ లో మంత్రి మీద మాటల దాడిచేశారు. నేతల తిట్లపురాణంతో వాతావరణం ఒక్కాసారిగా మారిపోయింది. ఇద్దరం రాజీనామా చేసి మళ్ళిపోటీ చేద్దాం రారా సాలె అంటూ రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.

ఇద్దరం రాజీనామా చేసి మళ్ళిపోటీ చేద్దాం రారా సాలె అంటూ రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

అప్పటివరకు బాగానే ఉంది. ఆ తర్వాతే పరిస్థితి మారిపోయింది. రేవంత్‌రెడ్డితో సవాళ్లు, తిట్ల ఎపిసోడ్ తర్వాత నుంచి మల్లారెడ్డి తన మొబైల్ మోగితే కలవరపడుతున్నారట. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయాలంటే జంకుతున్నారట. మాట్లాడలంటే మెసేజ్ మీ అని ఫోన్ చేసిన వ్యక్తులకు మెసేజ్ పెడుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎవరు ఫోన్ చేసినా మాట్లాడే నేత ఎందుకలా అని అర్థం కాక కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆరాతీస్తే ఆసక్తికర విషయం తెలిసింది. రేవంత్‌రెడ్డిని తిట్టిన తర్వాత మల్లారెడ్డికి విరామం లేకుండా ఫోన్ కాల్స్ వస్తున్నాయంట. ఫోన్ ఎత్తితే చాలు అవతల నుంచి రేవంత్ అభిమానుల పేరుతో తిట్లదండకం అందుకుంటున్నారంట. తమ నేతనే తిడతావా అంటూ రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి అభిమానుల వార్నింగ్‌లను భరించలేకే ఆయన ఫోన్ ఎత్తడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఫోన్ చేసిన వ్యక్తులు మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి వాళ్లు ఎలా రెచ్చిపోతారోనని మల్లారెడ్డి సహనంతో భరిస్తున్నారంట.

Leave a Reply

Your email address will not be published.