కలెక్టర్‌ వాహనానికి 23 చలానాలు.. పట్టించుకోని పోలీసులు!

కలెక్టర్‌ వాహనానికి 23 చలానాలు.. పట్టించుకోని పోలీసులు!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సాదారణంగా రెండూ మూడు చలనాలు పెండింగ్‌లో ఉంటే వాహనాలను సీజ్ చేస్తామని ఇటీవల పోలీసులు ప్రకటించారు. అయితే వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని న్యాయవాదులు చెబుతున్నారు. అటు పోలీసులు, ఇటు న్యాయవాదులు ఎవరి వాదనను వారు వినిపించుకుంటున్నారు. చలనాల విషయంలో పోలీసులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పలుకుబడి, ఖరీదైన వాహనదారులు ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించనా చూసిచూడనట్లు పోలీసులు వ్యవహరిస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సహజంగానే పోలీసులు సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపిస్తుూ ఉంటారు. ఇది అదంరికీ తెలిసిన సంగతే. అయితే ఓ కలెక్టర్ అధికారిక వాహనంపై ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా 23 చలానాలు పెండింగ్‌ ఉన్నాయి. ఈ వాహనానికి పడిన జరిమానా ఎంతో తెలుసా అక్షరాల రూ. 22,905 వేలు. అతివేగం, ప్రమాదకరంగా వాహనాన్ని నడపడం, జీబ్రా లైన్‌ను క్రాస్‌ చేయడం లాంటి అతిక్రమణలకు ఈ చలానాలు విధించారు. మరి ఈ వాహనాన్ని మాత్రం పోలీసులు ఎందుకు సీజ్‌ చేయడం లేదనే అనుమానం రావచ్చు. ఆ వాహనం చట్టాలను అమలు చేయడమే కాదు.. వాటికి లోబడి నడుచుకోవాల్సిన ఓ జిల్లా కలెక్టర్‌ గారిది. అందుకే పోలీసులు చూసిచూనట్లు వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24 నుం చి ఈ ఏడాది ఆగస్టు 30 వరకు 23 చలాన్లు పడ్డాయి. జనగామా జిల్లా కలెక్టర్‌గా నిఖిల పనిచేశారు. ఇటీవల ఆమెను వికారాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు. నిఖిల జనగామా కలెక్టర్ ఉన్న సమయంలో ఆమె అధికారిక వాహనానికి పోలీసులు ఈ చలానాలు విధించారు. ఈ వార్త వైరల్ కావడంతో సమాన్యులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. చట్టాలను అమలు చేయాల్సిన కలెక్టరే చలానాలు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.