లాక్ డౌన్ నేపథ్యంలో కెసిఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం..

లాక్ డౌన్ నేపథ్యంలో కెసిఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం..

ఆర్.బి.ఎం డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.ప్రధానంగా ఈ సమావేశంలో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రోజుతో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడగించాలా లేదా లాక్ డౌన్ సమయంలో సడలింపులు చేయాలా అనే అంశాలపై ఈ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరో పది రోజుల పాటు లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం.ఈ క్రమంలో పలు రంగాలకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుండి కరోనా తగ్గుముఖం.

మరోవైపు ఎంపీ ఓవైసీ లాక్ డౌన్ ను పొడగించ వద్దంటూ సీఎంఓకు ట్వీట్ చేశారు.లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని కేవలం నాలుగు గంటల సమయంలో వాళ్లు ఏం చేస్తారు అని ఓవైసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు లాక్ డౌన్ ఒక అస్త్రం కాదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈరోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పేదలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి అలాంటి వారికి లాక్ డౌన్ శాపంగా మారిందని ఓవైసీ అన్నారు.

కరోనా మహమ్మారినీ నియంత్రించడం కేవలం వ్యాక్సిన్ కె సాధ్యపడుతుందని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్ విధించాలని ఓవైసీ అభిప్రాయపడ్డారు.

మరికొద్ది క్షణాల్లో ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలో చర్చించిన అంశాలు మీడియా ముందుకు.

Leave a Reply

Your email address will not be published.