మరోసారి మానవత్వం చాటుకున్న కార్ఖానా పోలీసులు..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ నేపథ్యంలో సాధారణ ప్రజలే కాకుండా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా లాక్ డౌన్ కొంత ఇబ్బందికరంగా మారింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న17 ఏళ్ల టీనేజ్ కుర్రాడు కనీసం రోజుకు ఒక గంట నైనా కారులో బయట తిరగకపోతే చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
నగరంలోని కార్ఖానా పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసముంటున్న డాక్టర్ నాగలక్ష్మి కుఇద్దరు సంతానం మొదటి కుమారుడు పై చదువుల కోసం అమెరికా లో ఉన్నాడు.మరొక కుమారుడు తన మానసిక పరిస్థితి సరిగా లేనందు వలన తన తల్లి వద్దే హైదరాబాద్లో ఉంటున్నాడు.
డాక్టర్ నాగలక్ష్మి తన చిన్న కుమారుడి మానసిక పరిస్థితి సరిగా లేనందు వలన కనీసం రోజుకు ఒక గంట అయినా కార్లో బయట తిరగకపోతే వింత వింతగా ప్రవర్తిస్తూ ఆవేదనకు గురి అవుతుంటాడు. ఒకవేళ తన తల్లి బలవంతంగా ఇంట్లో ఉంచితే ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కిందపడేసి చిందర వందర చేస్తూ తన కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఇంట్లో ఉన్న వస్తువులను కింద పడేసి క్రమంలో తనకు గాయాలు అవుతున్నా కూడా పట్టించుకోకుండా తీవ్రమైన ఆవేశానికి గురవుతున్నాడు.
ఈ నేపథ్యంలో డాక్టర్ నాగలక్ష్మి తన కుమారుని మానసిక పరిస్థితి గురించి కార్ఖానా ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామికి వివరించింది. కాగా రోజూ తన కుమారుడికి ఒక గంట సేపు బయట కారులో తిరగడానికి అనుమతులు ఇవ్వాలని ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామినీ నాగలక్ష్మి కోరింది.
ఆ తల్లి మనోవేదనను అర్థం చేసుకున్నా ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి మానవత్వంతో స్పందించి రోజు ఒక గంట కారులో తిరిగేందుకు అనుమతి ఇచ్చాడు. తన కుమారుడు కొత్త వారిని చూసిన మాస్కులు పెట్టుకున్నా భయానికి లోనౌతాడని ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి కి తల్లికి చెప్పడంతో ఆయన మాస్కు లేకుండానే ఆ అబ్బాయితో నవ్వుతూ మాట్లాడారు. ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి మానవ దృక్పథంతో తీసుకున్న నిర్ణయానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.