కరీంనగర్ మైనింగ్ మాఫియాపై కమలం దృష్టి
ఆర్.బి.ఎం ఢిల్లీ: కరీంనగర్ మైనింగ్ మాఫియాపై కమలం పార్టీ దృష్టి సారించింది. బీజేపీ నేతల ఫిర్యాదుతో రంగంలోకి సీబీఐ దిగింది. బీజేపీ నేత పేరాల శేఖర్‌రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో
విశాఖ సీబీఐ బ్రాంచ్ విచారణ ప్రారంభించింది. కరీంనగర్ మైనింగ్ విదేశాలకు ఎగుమతి చేసే సమయంలో కాకినాడ పోర్టులో బాగోతం బయటపడింది. ఇప్పటికే పలు సంస్థలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. భారీగా పన్నుల ఎగవేత, మనీలాండరింగ్, అక్రమ రవాణా, అక్రమ మైనింగ్, అక్రమ ఎగుమతులపై సీబీఐ, కేంద్ర సంస్థలు దృష్టిపెట్టింది.