జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ..

జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ..

ఆర్.బి.ఎం అమరావతి: మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత తొలిసారి రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్‌లో చర్చిస్తారు. దిశా చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాలను కేబినెట్‌ సమీక్షించనుంది. అనంతరం కేంద్రానికి మరోసారి నివేదన పంపనున్నారు. అమ్మ ఒడి పథకం, గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశంలో చర్చిస్తారు. అసని తుఫాన్‌పై కేబినెట్ చర్చించనుంది. అంతేకాకుండా, ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ నిర్ణయాలకు, ఈ నెలలో చెల్లించే రైతు భరోసాకు, పలు పరిశ్రమలకు సంబంధించి భూముల కేటాయింపులకు కేబినెట్‌ ఆమోదించనుంది.

Leave a Reply

Your email address will not be published.