కేసీఆర్ మాట్లాడేవన్ని అబద్ధాలే: విజయశాంతి
ఆర్.బి.ఎం హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడేవన్ని అబద్ధాలేనని ధ్వజమెత్తారు. బాష మార్చుకోవాలని కేసీఆర్‌కు పలు మార్లు చెప్పానని ఆమె తెలిపారు. ఎవరినైనా కొంటా.. ఏదైనా చేస్తా.. అనే అహంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జవాన్లను కూడా కించ పరిచేలా కేసీఆర్ మాట్లాడారని తెలిపారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని తిట్టే హక్కు కేసీఆర్‌కు లేదని విజయశాంతి హెచ్చరించారు.