జగ్గారెడ్డిని భుజ్జగిస్తున్న భట్టి

జగ్గారెడ్డిని భుజ్జగిస్తున్న భట్టి

ఆర్.బి.ఎం  హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ఇదే విషయాన్ని ఆయన లేఖ ద్వారా సోనియాగాంధీకి తెలిపారు. అయితే జగ్గారెడ్డిని శాంతింపజేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ రంగంలోకి దింగింది. జగ్గారెడ్డికి నచ్చజెప్పేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాయబారం నడుపుతున్నారు. జగ్గారెడ్డికి భట్టి ఫోన్ చేశారు.

పార్టీ మారొద్దని జగ్గారెడ్డిని బుజ్జగించారు. ‘‘నాపై కోవర్టు అనే మచ్చ పడింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఠాకూర్ ఉన్నా.. లేకున్నా ఒక్కటే. ఇవాళ పార్టీకి రాజీనామా చేయను. పరిణామాలపై సోనియాగాంధీకి మరో లేఖ రాస్తా. మీతో కూర్చోని మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటా’’ అని భట్టితో జగ్గారెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక ఏ పార్టీలోనూ చేరేది లేదని జగ్గారెడ్డి చెబుతున్నారు. స్వతంత్రంగానే వ్యవహరిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్‌‌కు సోనియాగాంధీ కుటుంబంపైన మొదటి నుంచీ తన విధేయతను ప్రకటిస్తూ జగ్గారెడ్డి వస్తున్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి నియామకం పట్ల జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.