కాంగ్రెస్ గూటికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి..?

కాంగ్రెస్ గూటికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి..?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన క్షణం నుండి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి జోష్ పెరిగింది. వచ్చే సాధారణ ఎన్నికలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ను ఈ రోజు(ఆదివారం) వికారాబాద్ లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తో రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. గడ్డం ప్రసాద్ భవిష్యత్తు కార్యాచరణ గురుంచి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు సమాచారం.

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తో పాటు గడ్డం ప్రసాద్ ను కలవడానికి విశ్వేశ్వర్ రెడ్డి వెళ్లడం ఇప్పుడు రాజకీయాల్లో వర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేదా అనే అంశాలు తొందర్లోనే తెలియనున్నాయని సమాచారం.

Leave a Reply

Your email address will not be published.