దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి..

దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: భారత దేశ ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి. ఈ సందర్బంగా బి.జనార్దన్ రెడ్డి ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం మనం భారత దేశంలో ఇంత స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నామంటే ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితమే అని జనార్దన్ రెడ్డి అన్నారు.భారతదేశం కోసం.. భారతదేశం భవిష్యత్తు కోసం ఆనాటి సమరయోధులు వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన వారిని ఎన్నటికీ మర్చిపోలేం అని జనార్దన్ రెడ్డి అన్నారు. భారతదేశాన్ని ఆంగ్లేయుల చెర నుంచి విడిపించిన పోరాటయోధుల కృషి అసాధారణమైనది అని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మూడు రంగుల జండా రెపరెపలాడుతూ కులాలకు, మతాలకు అతీతంగా పండుగలా సాగె పంద్రాగస్టు రోజు ఇది అని ఆర్.బి.ఎం మీడియాతో స్వాతంత్య్ర దినోత్సవాని పురస్కరించుకొని చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డిమాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published.