దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నా చేస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నా చేస్తుంది:మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను ఆప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.

ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ పార్లమెంటుపై గుర్తుతెలియని దుండగులు చేసిన దాడి పట్ల సభలో చర్చించాలని అడిగిన ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులను ఆ ప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని తీవ్రంగా కండించారు భారత పార్లమెంటు పైన దాడి అంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం పైన జరిగిన దాడిగా భావించాలి అని అయన అన్నారు. భారత పార్లమెంటను రక్షించుకోలేని బిజెపి పాలకులు ఈ దేశాన్ని ఏమి కాపాడుతారని మండిపడ్డారు. ఈ దేశ రక్షణను ప్రధాని మోడీ గాలికి వదిలేసి సేదతీరుతున్నారు. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే పార్లమెంటుపై జరిగిన దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో సభ్యులు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ప్రశ్నించిన సభ్యులను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు చేర్య అని అయన అన్నారు. పార్లమెంట్ పై జరిగిన దాడితో ప్రపంచ దేశాల్లో భారత దేశ విలువ ఎంత దిగజారిందో దేశ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. పార్లమెంట్ పై ఈనెల 13న దుండగులు చేసిన దాడిపై ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా బిజెపి మంత్రులు మౌనంగా ఉండటం అసలేమి దాడి జరగలేదన్నట్టుగా వ్యవహరించడం అందుకు తగ్గట్టుగా వారి కార్యకలాపాలు ఉండటం బాధాకరం చాల బాధాకరం అని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published.