రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

ఆర్.బి.ఎం  హైదరాబాద్: ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 10న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు కౌంటింగ్ చేస్తారు. ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 24న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు. జూన్‌ 1న అభ్యర్థుల నామినేషన్లలను పరిశీలిస్తారు. జూన్ 3 రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీగా నిర్ణయించారు. తెలంగాణ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి. శ్రీనివాస్, ఏపీ నుంచి విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్ రాజ్యసభ సభ్యులుగా పదవి విరమణ చేయనున్నారు. వీరి స్థానంలో కొత్తవారిని ఎన్నుకుంటారు. దీంతో ఆశావాహులు పార్టీ అధినేతల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.