గాంధీ జయంతి వేడుకలో పాల్గొన్న పద్మారావుగౌడ్
ఆర్.బి.ఎం సికింద్రాబాద్: సితాఫలమండీలోని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని మహాత్మా గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉప సభాపతి పద్మారావుగౌడ్ మాట్లాడుతూ అహింస సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్చా స్వాతంత్య్రాలు ప్రసాదించిన మహానాయకులు సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన మన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న భారత దేశాన్ని నిర్మించేందుకు ప్రజలందరూ కృషి చేయాలని పద్మారావు గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, శ్రీమతి రాసురి సునిత, శ్రీమతి కంది శైలజ తదితరులు పాల్గొన్నారు.