మంచిర్యాల జిల్లాలో పిడుగుపాటుకు తల్లి,కొడుకు మృతి..

మంచిర్యాల జిల్లాలో పిడుగుపాటుకు తల్లి,కొడుకు మృతి..

ఆర్.బి.ఎం మంచిర్యాల: జిల్లాలో కురిసిన వర్షాలు ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ పై ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న కుటుంబం పిడుగుపాటుకు బలైంది. పిడుగు వారిపై పడటంతో ఒక్కసారిగా వారు కింద పడిపోయారు. ద్విచక్ర వాహనంపై నుండి క్రింద పడగానే తల్లి,కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
పెద్దపల్లి జిల్లా ,మంథిని మండల్ , గడ్డంపల్లి కి చెందిన అందే వెంకటేష్ గా గుర్తించారు. వెంకటేష్ భార్య మౌనిక, కుమారుడు శ్రేయస్ ఇద్దరు మృతి చెందారు. దింతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published.