ముందుస్తు ఎన్నికలకు జగన్ రెడీ?… అందుకే ఏపీలోకి పీకే రీ ఎంట్రీ!

ముందుస్తు ఎన్నికలకు జగన్ రెడీ?… అందుకే ఏపీలోకి పీకే రీ ఎంట్రీ!

అమరావతి: ఏపీలో రెండో సారి అధికారంలోకి రావడానికి సీఎం జగన్ వ్యూహత్మకంగా ముందుకు పోతున్నారని చెబుతున్నారు. అయితే రెండో సారి ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం నుంచి అధికారులందరూ వెళ్లిపోయాక మంత్రులతో జగన్‌ మాట్లాడారు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం రాష్ట్రమంతా పర్యటించి సమగ్ర సర్వే చేపడుతుందని ఆయన చెప్పడంతో మంత్రులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రులకు జగన్ సూచించారు. ఈ పరిణామాలతో దీంతో జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ప్రశాంత్‌కిషోర్ టీం రాష్ట్రవ్యాప్తంగా సర్వే పర్యటించిన జగన్‌కు రిపోర్టు ఇస్తుందని, ఆ రిపోర్టు ఆధారంగా జగన్ ముందుస్తు ఎన్నికలపై ప్రశాంత్‌కిషోర్ టీంతో సమాలోచనలు చేస్తారని చెబుతున్నారు. పీకే టీం పర్యటనలో ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్టు వస్తే ముందుస్తు ఎన్నికలకు జగన్‌కు వెళ్లడం ఖాయమని ఆ పార్టీ రాజకీయ పండితులు చెబుతున్నారు. మరోవైపు జగన్‌పై నమోదైన ఈడీ కేసులలో విచారణ వచ్చే ఏడాది పూర్తయి తీర్పు వెలువడే అవకాశం ఉండటంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనతో జగన్‌ ఉన్నారని అధికార పార్టీ నాయకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.