క్యాసారంలో బతుకమ్మ చీరల పంపిణి..

kyasaram

క్యాసారంలో బతుకమ్మ చీరల పంపిణి..

ఆర్.బి.ఎం క్యాసారం: పటాన్ చేరు నియోజకవర్గం క్యాసారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమాన్నికి జడ్పీటీసీ సుప్రజ వెంకట్ రెడ్డి,ఎంపిపి సుష్మ రెడ్డి వేణు గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరై గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలు అందరిజేశారు.

kyasram village

ఈ సందర్బంగా క్యాసారం గ్రామ ఉప్ప సర్పంచ్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హాయంలో అన్ని వర్గాలను అన్ని కులాలను సమానంగా చూస్తూ కోట్ల రూపాయలు ఖర్చు చేసి దసరా,రంజాన్,క్రిస్మస్ పండుగలకు మహిళలకు చీరలు పంపిణి చేస్తున్న ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కె దక్కుతుందని విక్రమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ప్రజలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మేలు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు కెసిఆర్ ప్రవేశపెట్టారని విక్రమ్ రెడ్డి అన్నారు. ఇంటి పెద్ద కొడుకుల రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దసరా ,రంజాన్,క్రిస్మస్ పండగలకు ఆడపడుచులకు చీరలు బహుమానంగా ఇస్తున్నారని విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదని విక్రమ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాంచెందర్, గ్రామ సర్పంచ్ పెంటయ్య, గ్రామ సభ్యులు ఈశ్వరయ్య, అమర్, ఇంద్రజ, దశరథ్, వెంకటేశం, సుభాష్ రెడ్డి, విజయ, సంజీవ, శరణప్ప, సుధాకర్ రెడ్డి, యూ సత్యనారాయణ గౌడ్, నర్సింలు గౌడ్, బి.రమేష్ బాబు, ఏ సుధాకర్ రెడీ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.