పేదలకు అండగా తెరాస ప్రభుత్వం..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముందుంటుందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతఫాల్ మండి శ్రీనివాస్ నగర్ డివిజన్ కి చెందిన స్రవంతి అనే మహిళా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం ఉప సభాపతి పద్మారావు గౌడ్ ద్రుష్టికి తీకువెళ్లిన స్థానిక నాయకులు. ప్రజల సమస్యను తన సమస్యగా భావించే పద్మారావు గౌడ్ అతి తక్కువ సమయంలో వారికీ వైద్యానికి అయ్యే ఖర్చు CMRF ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ రోజు తమ క్యాంపు కార్యాలయంలో బాధితులకు నిధుల మంజూరు పత్రాన్ని పద్మారావు గౌడ్ అందజేశారు.