ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కవితకు శుభాకాంక్షలు చెప్తూనే అలా అనేశాడు..
హైదరాబాద్: స్థానిక సంస్థ ఎమ్మెల్సీ లో ఘన విజయం సాధించిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కవితకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ శుభాకాంక్షలు తెలుపుతూనే సెటైర్ వేశాడు. దాదాపు 16 నెలలు ఉద్యోగం లేక మీరు ఎంత మానసిక వేదనకు లోనైరో అందరూ చూశారు. చివరికి మీ కల నెరవేరింది. కనీసం ఇప్పుడైనా తెలంగాణ లోని నిరుద్యోగుల గురుంచి ఆలోచించండి అంటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కవితకు ట్విట్ చేశారు. 16 నెలలు మీరు ఎంత ఇబ్బంది పడ్డారో గత 66 నెలలుగా అలాంటి వేదన తెలంగాణ ఉన్న లక్షల మంది ఉద్యోగులు పడ్తున్నారు. ఇకనైనా మీ కుటుంబ పదవుల గురుంచి ఆలోచించడం మానేసి ప్రజల గురుంచి ఆలోచిస్తే బాగుంటుంది అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ట్విట్ లో చెప్పుకొచ్చారు.