ఖమ్మం,నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల సర్వే నిర్వహించిన “V The Public Pulse” పొలిటికల్ క్యాంపెన్ సంస్థ…

ఖమ్మం,నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల సర్వే నిర్వహించిన V The Public Pulse పొలిటికల్ క్యాంపెన్ సంస్థ…

హైదరాబాద్: ఖమ్మం,నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ పార్టీ గెలవబోతోందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రజల్లోనే కాకుండా నాయకుల్లో కూడా ఈ పరిస్థితి మొదలైంది. తాజాగా V The Public plus అనే పొలిటికల్ క్యాంపెన్ సంస్థ నిర్వహించిన సర్వేలో అందరు ఆశ్చర్యపోయే విధంగా పోల్స్ నమోదయ్యాయి. ప్రజలు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆరెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఓట్ల రూపంలో వెలువడే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థులను కొన్ని పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. మిగిలిన పార్టీలలో ఎవరిని ప్రకటిస్తే విజయ దుందుభి మోగిస్తారో వారికే టికెట్ కేటాయించాలని పార్టీలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఖమ్మం,నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సంచలన జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కూడా రేసులోకి వస్తున్నారు. అయితే ప్రతి రోజు టీఆరెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను మల్లన్న వివరిస్తూ ప్రజలకు పరోక్షంగా దెగ్గరైయ్యాడు. తాజాగా వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో మల్లన్నకు ప్రజలు బ్రహ్మరథం పడతారు అని ప్రజల నాడి తెలుస్తోంది. V The Public Plus నిర్వహించిన ప్రజల నాడి ప్రకారం వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధిస్తారని సర్వేలో వెల్లడైంది.

వివిధ సామాజిక మాధ్యమాలో నిర్వహించిన V The Public Plus సర్వేలో 130000 మంది పాల్గొన్నారు. సర్వే నిర్వహించిన గ్రూపులలో Spirit of Telangana (70k members),Telangana Social media (40k members), Netizens JAC (13K members),Telangana News (20k members),Yuva thelangana party(7k members),Trs Social Media.(9.7k members),Bjp For Telangana (34k members),Teenmar mallana(41.2kmembers),Teenmar mallana team(93k members),Revanth reddy army(17k members)లు పాల్గొని వారి నాడి పేర్కొన్నారు.

ఈ సర్వేలో ఏ అభ్యర్థికి ఎన్ని పోల్స్ నమోదైతాయో ఈ గ్రూపు సభ్యుల ద్వారా వివరించడం జరిగింది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు 63% రాణీరుద్రమదేవికి 5% కోదండరామ్ 11% చెరుకు సుధాకర్కు 3% పళ్ళ రాజేశ్వర్ రెడ్డికి12% కాంగ్రెస్కు 3% బీజేపీకి 3% శాతం నమోదయ్యాయి.

అన్ని పార్టీలలో అభ్యర్థులను ఖరారు చేయగా మిగిలిన బీజేపీ,కాంగ్రెస్ లలో ఇంకా అభ్యర్థులను ప్రకటించని కారణంగా ఓటు ఎవరికి వేయాలో తెలియక ఈ రెండు పార్టీలకు పోల్స్ తక్కువ శాతం నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published.