శభాష్ కార్ఖానా పోలీస్..
హైదరాబాద్: పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల సంరక్షణ కోసమేనని అనునిత్యం ప్రజలను కాపాడడమే వారి పని అని మరోసారి రుజువు చేశారు కార్ఖానా పోలీసులు . కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీ ప్రాంతంలో ఒక వ్యక్తి భవనం పై భాగంలోకి ఎక్కి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. బాధితుడు పై నుండి దూకుతా అని అక్కడి వారికి చెప్పడంతో స్థానికులు వెంటనే కార్ఖానా పోలీసులకు సమాచారం అందించారు. కొద్దీ నిమిషాలకే సంఘటన స్థలానికి చేరుకున్న డిఐ నేతాజీ వారి సిబ్బంది బాధితుడిని కిందకు దింపేందుకు శతవిధాలా ప్రయత్నిచారు అయినా వినకపోవడంతో బుజ్జగింపులు చేశారు. ఎంత సేపటికి బాధితుడు డిఐ నేతాజీ మాట వినకపోవడంతో అప్పుడు సమయస్ఫూరి ప్రదర్శించి తనకి ఎం కావాలో అని అడగగా బాధితుడు తనకు ప్రభుత్వం నుండి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని తన కుటుంబం గుడిసెల్లో ఉంటోందని ఇప్పటికే ఎన్నో ఆఫీస్ ల చుటూ తిరిగిన తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని డిఐ తో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో డిఐ నేతాజీ స్వయంగా నేనే వచ్చి నీకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడు. ఆ హామీతో బాధితుడు వెంటనే భవనం పై నుండి కిందికి దిగి వచ్చాడు. ఆత్మహత్యాయత్నంకు పాల్పడుతున్న వ్యక్తిని తన మంచి మనసుతో కాపాడినందుకు స్థానికులు డిఐ నేతాజీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడీ వార్త సామజిక మాధ్యమాల్లో తెగ చెక్కర్లు కొడుతుంది.