కొడుకు మీద ప్రేమతో చంద్రుడిపై స్థలం కొన్న తండ్రి
సూరత్: ఒక తండ్రి తన పిల్లల కోసం రాత్రి పగలు కస్టపడి వారి కోసం వారి భవిష్యత్తు కోసం ఆస్తులు కూడబెడతాడు ఇది సహజంగా అందరి ఇళ్లలో జరిగేదే. కానీ ఇక్కడ ఓ తండ్రి మాత్రం అందరిలాగా కాకుండా పూర్తిగా భినంగా ఆలోచించాడు. గుజరాత్‌లో గల సూరత్‌కు ప్రాంతానికి చెందిన విజయ్ భాయ్ కథిరియా అనే వ్యాపారి తన రెండు నెలల కుమారుడు నిత్య కోసం ఏకంగా చంద్రుడి పైనే స్థలం కొనాలనుకున్నాడు.
చంద్రుడిపై స్థలం కొనడం కోసం న్యూయార్క్‌లోని ఇంటర్‌నేషనల్ లూనార్ రిజిస్ట్రీకి మెయిల్ పంపి అనుమతులు కోరాడు.విజయ్ భాయ్ కథిరియా అనుమతులు కోరుతూ మెయిల్ చేసినందు దానికి అనుకూలంగా స్పందిస్తూ మార్చి 13వ తేదీన అనుమతులు వచ్చాయి. విజయ్ భాయ్ కథిరియా కుమారుడు నిత్య పేరిట చంద్రుడిపై ఒక ఎకరం స్థలం కొన్నట్లు సర్టిఫికెట్ సదరు కంపెనీ విజయ్ భాయ్ కథిరియా కు ఇచ్చింది.
విజయ్ భాయ్ కథిరియా కుమారుడు నిత్య పేరిట ఒక ఎకరం స్థలం చంద్రుడిపై గల ‘సీ ఆఫ్ మస్కోవీ’ అనే ప్రాంతంలో స్థలం కేటాయించినట్టు ఆ సర్టిఫికెట్ లో పేర్కొన్నారు. చంద్రుడిపై స్థలం సంపాదించడం సాధ్యం కాదని తెలసికూడా ఎదో చెప్పుకోవడానికి మాత్రమే ఇది వీలు అవుతుంది. కేవలం చంద్రుడిపై భూమి కోనం అని చూపించుకోవడానికే సర్టిఫికెట్ మాత్రమే ఉంటుంది. గతంలో కూడా చంద్రుడి పై రాజస్థాన్ కు చెందిన ధర్మేంద్ర అనీజా అనే వ్యక్తి ఏకంగా మూడు ఎకరాల స్థలం కొని తన భార్యకు బహుమానంగా ఇచ్చాడట