వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం

వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం
వికారాబాద్:వికారాబాద్ జిల్లాలో ఎడతేరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం. ఈ రోజు కురిసిన వర్షానికి తాండుూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులో బండల వాగు పోంగిపోర్లింది. వాగులో నీటి ఉద్ర్తితి పెరగటంతో అటుగా వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోన్నారు. ఈ క్రమంలో వాహనాలు భారీగా రోడ్డుపైనే నిల్చిపోయాయి. పెద్దేముల్ మండలం గాజీపూర్ సమీపంలోని వాగు నిండి రోడ్డుపైకి రావడంతో తాండూర్ కోట్ పల్లి రోడ్డులో వాహనాదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. ప్రతి వర్ష కాలం ఈదేవిధంగా అవస్తలు ఎదురుకుంటున్నాం అని స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published.