రోజు రోజుకి సిద్దిపేటలో పెరిగిపోతున్నా కరోన కేసుల సంఖ్య

సిద్దిపేట: కరోన మహామ్మరిని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కరోన వ్యాప్తి చేందకుండా ఉండేందుకు కఠిన చర్యలు తిసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కరోన వ్యాప్తి చేందకుండా ఉండేందుకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికి రోజు రోజుకి కరోన కేసుల సంఖ్య భారీగా పేరుగుతునే ఉంది. ఈ క్రమంలో సిద్దిపెట జిల్లాలో రోజు రోజుకు కరోన పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. సిద్దిపేట జిల్లలో ఒక్క రోజే 38 కరోన కేసులు నమెదైయ్యాయని వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. సిద్దిపేట పట్టణంలో 10,రాయపోల్ లో 7, చందళాపూర్ లో 6, ఇబ్రహీంనగర్ లో 5, హుస్నాబాద్ లో 4, గజ్వేల్ లో 2, రాయవరం, దుబ్బాక, తోగుట, మేడిపల్లి గ్రామాల్లో ఒక్కో కరోన పాజిటివ్ కేసులు నమెదైనట్లు అధికారులు ప్రకటించారు.రంగనాయకసాగర్ రిజర్వాయర్లో పని చేస్తున్న ఆరుగురు కార్మికులకు కరోన సోకినట్లు అధికారులు పేర్కోన్నారు. అదేవిధంగా ఇబ్రహింనగర్ లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోన పాజిటివ్ వచ్చింది. సిద్దిపేట జిల్లాలో 41 మంది అనుమానితుల శాంపిల్స్ సేకరించిన అధికారులు. కాగా మొత్తం 61 మంది శాపింల్స్ పెండింగ్ లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో కరోన పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురైవుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published.