హర్యానా గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి జనార్దన్ రెడ్డి..

హర్యానా గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి జనార్దన్ రెడ్డి..

ఆర్.బి.ఎం డెస్క్: చండీఘడ్ లోని హర్యానా రాజ్ భవన్లో పంజాబ్, హర్యానా హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు హాజరైయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి బండారు దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ పార్టీలో కష్టపడేవారికి ప్రాధాన్యం ఉంటుందని దానికి ఉదాహరణ దత్తాత్రేయ గారేనని జనార్దన్ రెడ్డి అన్నారు. దత్తాత్రేయ గారు పార్టీ సిద్ధాంతాల కోసం ప్రజల శ్రేయస్సు కోసం పని చేసిన వ్యక్తి అని జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజా సింగ్,రఘునందన్ రావు, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి,చింతల రామచంద్ర రెడ్డి,తదితర నాయకులూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.