ఈటల రాజేందర్ పాదయాత్ర రూట్ మ్యాప్..

ఈటల రాజేందర్ పాదయాత్ర రూట్ మ్యాప్..

ఆర్.బి.ఎం డెస్క్ : మాజీ రాష్ట్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్  పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పార్టీ వర్గాలు సిద్ధం చేశాయి. ఈటల రాజేందర్ చేయబోయే ఈ పాదయాత్ర 22 రోజులు పాటు కొనసాగనుంది. 22 రోజుల్లో 350 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. వరంగల్ అర్బన్ జిల్లా లోని బత్తు రోనిపల్లిలో శుక్రవారం రోజు ఈటల పాదయాత్ర ప్రారంభించున్నారు. ఈ పాదయాత్ర సుమారు 125 గ్రామాలపై కొనసాగుతుంది అని పేర్కొన్నారు. కాగా వరంగల్ అర్బన్ జిల్లా లోని బత్తు రోనిపల్లిలో ప్రారంభమైన ఈ పాదయాత్ర జమ్మికుంటలో ముగుస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఈటల పాదయాత్ర సాగనుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.