భారత జాతికి దిక్సూచిగా నిలిచి కోట్లాది మంది బహుజనుల జాతకాలు మార్చిన మహా రచయిత డా.అంబేడ్కర్: బి. జనార్దన్ రెడ్డి

భారత జాతికి దిక్సూచిగా నిలిచి కోట్లాది మంది బహుజనుల జాతకాలు మార్చిన మహా రచయిత డా.అంబేడ్కర్: బి. జనార్దన్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: భారత జాతికి దిక్సూచిగా నిలిచి కోట్లాది మంది బహుజనుల జాతకాలను మార్చిన మహా రచయిత మేధావి పాలనాదక్షుడు ఆర్థిక శాస్త్రవేత్త సంఘ సంస్కర్త భారత రాజ్యాంగ నిర్మాత ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది డా.అంబేడ్కర్. డా.అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని అయన చిత్ర పటానికి నివాళులు అర్పించిన బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి.

జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అంబేడ్కర్ గారు ప్రపంచం గర్వించదగ్గ మేధావి భారత దేశానికి దిక్సూచి ఆర్థికశాస్త్రంలో తిరుగులేని నైపుణ్యుడు న్యాయశాస్త్రంలో ఎవరికి తీసిపోని దిట్ట వీటన్నిటిని మించి సామాజిక అస్మానతలపై తిరుగుబాటు జండా ఎగరవేసిన విప్లవ యోధుడు ఇన్ని చదువులు ఇంత మేధావి అయ్యి కూడా దుర్భరమైన అవమానాలను ఎదుర్కొన్నారు డా.అంబెడ్కర్. సామాజికంగా వెనుకబడిన మహర్ కులంలో పుట్టిన అంబెడ్కర్కు సమాజంలోని దురాచారాలను అసమానతలు చిన్నప్పుడే అర్థమయ్యాయి. బడిలో అగ్రకులాల విద్యార్థులతో సమానంగా కూర్చోవడానికి వీలు ఉండేదికాదు. ఇంటి నుండి ఒక గోని తెచ్చుకొని మళ్ళి బడి నుండి ఇంటికి పోయేటప్పుడు తీసుకుపోవాలి. ఈ అసమానతలు అంబెడ్కర్ లేత హృదయాన్ని గాయపరిచాయి. బడిలో దాహాం వేస్తే అగ్ర కులాల వాళ్ళు కొళాయి తిప్పితే నీళ్లు తాగాలి ఇలాంటి అవమానాలు అంబెడ్కర్ లేత మనసును తీవ్రంగా గాయపరిచింది. అందరితో సమానంగా ఎందుకు ఉండకూడదో అర్ధం కానీ వయసు ఆయనది. అది ఎందుకు అన్యాయమే వివరించలేని ప్రాయమది. ఈ క్రమంలో అది ముమ్మాటికీ దుర్మార్గమేనని అంబెడ్కర్ కు అర్థమైంది.అదే అంబెడ్కర్ మెదడులో నిప్పు రాజేసింది. యుగాల తరబడి సమాజంలో అట్టడుగు వర్గాలను అవమానిస్తూనే ఉన్నారని తెలుసుకునే కొద్దీ అంబెడ్కర్ అగ్గిలం మీద గుగ్గిలంల అయ్యారు. అంబెడ్కర్ ఒక్క కులానికి మాత్రమే సంబంధించిన వ్యక్తిగా చూడకూడదని  నేటి సమాజంలో మనిషికి చదువు ఎంతో ముఖ్యమని ఈ సందర్బంగా బీజేపీ చేవేళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.