రాజకీయాల్లోకి బండారు దత్తాత్రేయ కూతురు..!

రాజకీయాల్లోకి బండారు దత్తాత్రేయ కూతురు..!

ఆర్.బి.ఎం డెస్క్ : హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ రాజకీయాల్లోకి అరంగ్రేటం చేస్తున్నారా? అందుకు ఆమె గ్రౌండ్ వర్క్ ఇప్పటి నుంచే ప్రిఫేర్ చేసుకుంటున్నారా ? అయితే అవును అనే అంటున్నాయి కాషాయ వర్గాలు. అంతేకాదు ఆమె ఇప్పుడే నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నారంట. దత్తాత్రేయ ఇంటి నుంచి ఇప్పటివరకు రాజకీయ వారసులు లేరు. వచ్చే ఎన్నికల్లో దత్తన్న వారసత్వాన్ని విజయలక్ష్మీ అందుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా ఇటీవల రాజకీయ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది.

ప్రతి యేటా విజయదశమి తర్వాత అలాయ్, బాలాయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తారు. గత ఏడాది కరోనా కారణంగా నిర్వహించలేకపోయారు. ఈ ఏడాది అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని జలవిహార్‌లో ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. అయితే దత్తాత్రేయ ఈ కార్యక్రమ బాధ్యతలను విజయలక్ష్మికి అప్పగించారు. ఆహ్వానాల దగ్గర నుంచి ఏర్పాట్లు అన్నీ ఆమె చేతుల మీదుగా సాగుతున్నాయి.

ఇటీవల బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా విజయలక్ష్మీ పాల్గొంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. పాదయాత్రలో అలా వచ్చి ఇలా వెళ్లకుండా చాలా రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావడంతో సీరియస్ రాజకీయాల్లోకి రావడం ఖాయమనే భావన అందరిలో ఉంది.

వచ్చే ఎన్నికల్లో విజయలక్ష్మీ పోటీ చేయాలకుంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. తన తండ్రికి సికింద్రాబాద్‌లో మంచిపట్టు ఉంది. ఆయన ఇక్కడి నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అయితే ఈ సారి మాత్రం అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేదు. ఆ స్థానం నుంచి కిషన్ రెడ్డి గెలిచి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక అక్కడ విజయలక్ష్మీ పోటీ చేసే అవకాశం లేదు.

    మామ జనార్దన్ రెడ్డి తో విజయలక్ష్మి

విజయలక్ష్మీ, మామ జనార్దన్ రెడ్డి కూడా బీజేపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గత పార్లిమెంట్ ఎన్నికల్లో ఆయన చేవెళ్ల పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. ఒక వేళ విజయలక్ష్మీ అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటే జనార్దన్ రెడ్డి కోడలి కోసం తన సీటు త్యాగం చేస్తారని అందరూ అనుకుంటున్నారు. ఆమె అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలనుకుంటే సనత్ నగర్ టికెట్ అడిగే అవకాశం ఉందని చెబుతున్నారు. విజయలక్ష్మీ వ్యూహం ఎలా ఉందో వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published.