ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌.. నగ్న చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌


ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌.. నగ్న చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌

ఆర్.బి.ఎం తూప్రాన్‌ (మనోహరాబాద్‌): ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వ్యక్తి నమ్మించి వీడియోకాల్‌లో నగ్న చిత్రాలు రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న విషయంపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల కేంద్రంలో సోమవారం దీనిపై కేసు నమోదైంది. ఎస్‌ఐ రాజుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం మనోహరాబాద్‌కు చెందిన విద్యార్థి (22)కి ఈ నెల 11న ఫేస్‌బుక్‌లో అపరిచిత వ్యక్తి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేయడంతో అపరిచిత వ్యక్తి తన నంబరు 6307652945 నుంచి వీడియోకాల్‌ చేసి మాట్లాడాడు. మాయమాటలు చెప్పి నగ్నంగా చాట్‌ చేయించి రికార్డు చేశాడు. అనంతరం వాటిని బాధితుడికి పంపించి ఫేస్‌బుక్‌లో పెడుతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడు. దీంతో బాధిత విద్యార్థి ఫోన్‌పేతో రూ. 14,133లు పంపించాడు. కొద్దిరోజులకు మరోసారి డబ్బులు పంపించాలని, లేదంటే నగ్న చిత్రాలు ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వివరించారు.

Leave a Reply

Your email address will not be published.