కవితకు ఊరట

కవితకు ఊరట

ఆర్.బి.ఎం హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు సిటీ కోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కవిత భర్త తరఫు బంధువుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఎంపీ పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సా ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిందని, ఈ విధానం రూపకల్పనకు సంబంధించిన భేటీల్లో కూడా వారు పాల్గోన్నారని తెలిపారు. ఈ ఆరోపణలపై కవిత సిటీ సివిల్ కోర్టులో పర్వేశ్‌ వర్మ, మంజీందర్‌ సిర్సా పరువునష్ట దావా వేశారు. పరువునష్టం దావాను పరిశీలించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. సోషల్ మీడియా, మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజింధర్‌కు నోటీసులిచ్చారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారని కవిత పిటిషన్‌‌లో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత లాయర్లు కోరారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై పరువు నష్ట దావా వేశారు.

Leave a Reply

Your email address will not be published.